RBI slashed interest rate | శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ..
RBI slashed interest rate : ఆర్‌బీఐ (RBI) ఓ శుభవార్త చెప్పింది. వడ్డీ రేటును మరోసారి తగ్గిస్తున్నట్టు (RBI slashed key interest rate) వెల్లడించింది. ఆర్‌బీఐ ఇలా నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా రెండోసారి. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రిపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. దీంతో హోం లోన్, వాహన లోన్, కార్పొరేట్ లోన్లపై వడ్డీ తక్కువ అవుతుంది.
వడ్డీ రేటు అంటే ఏమిటి?
వడ్డీ రేటు అనేది RBI ద్వారా బ్యాంకులకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ. దీన్ని 'రిపో రేట్' అని పిలుస్తారు. బ్యాంకులు ఈ వడ్డీ రేటుతో RBI నుంచి డబ్బులు అప్పు తీసుకుంటాయి. రిపో రేట్ (Repo rate) తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో ఈ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది.దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra )మాట్లాడుతూ 'మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ నిర్...