Bank Holidays : మే నెలలో ఏకంగా 13రోజులు బ్యాంకులకు సెలువులు
                    Bank Holidays in May 2025 | మే నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలువులు రానున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. ఏయే రోజుల్లోమూసి ఉంటుందో తెలుసుకోవడం ఉత్తమం. ముందస్తుగా సమాచారం లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉంటుంది.
సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని మే నెలలో రెండు వారాలకుపైగా బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ సేవలు నిరంతరాయంగా పని చేయనున్నాయి. వాటి సహాయంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. క్యాష్‌ని విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పలు బ్యాంకులు సైతం క్యాష్ డిపాజిట్ మెషిన్స్ సైతం అందుబాటులో ఉంచాయి. వీటితో అకౌంట్‌లో డబ్బులు వేసుకునే సౌలభ్యం ఉంది...                
                
             
								



