Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..
నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర…
అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం
అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి?
విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి?
Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ...