Job Mela | రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
Job Mela 2025 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ,(టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్ ) 25 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులకు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.15,000 నుంచి రూ.25,000 వేలవరకు వేతనం అందించనున్నారు. ఈ టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్స్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు HR (Ph.No.7799884996, 7799464344) ను సంప్రదించా...




