Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు (Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ (1st year), సెకండ్ ఇయర్ (2nd year) ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్...