Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ సర్టిఫికెట్..
Equivalence certificate : విదేశాల్లో చదివిన (foreign qualifications) విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చి ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించాలనుకున్నా లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్నా పెద్ద సమస్యే. విదేశాల్లో వారు పొందిన డిగ్రీ (foreign degrees)కి భారతదేశంలో గుర్తింపు ఉండదు. దీంతో యువత అనేక అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చినా భారత్‌లో ఆ ధ్రువీకరణ పత్రాలు చెల్లవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యూజీసీ (University Grants Commission) ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశీ డిగ్రీలను పరిశీలించి, అవి సరైనవి అని తేలితే వాటికి సత్సమాన సర్టిఫికెట్ (Equivalence Certificate) జారీ చేయాలని నిర్ణయించింది.
ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారు?
చాలా మంది భారతీయులు విదేశాల్లో (foreign educational institutions) చదువుకొని తిరిగి భారత...