ఏపీలో TG EAPCET సెంటర్లు ఇక ఉండవు… రద్దు చేసిన JNTU
TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పరీక్ష కేంద్రాలు ఉండవు. వాటిని రద్దు చేస్తున్నట్టు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ పరీక్ష కేంద్రాలను తొలగిస్తున్నామని పేర్కొంది.
రిజర్వేషన్ల నేపథ్యంలో మార్పు
తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరు...