Pharmaceutical Industry | ఫార్మా రంగంలో సరికొత్త ప్రోగ్రాం.. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
Pharmaceutical Department | ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగు పడనున్నాయి. ఈ రంగంలో నెలకొన్న నిపుణుల కొరతను అధిగమించడానికి కసరత్తు జరుగుతోంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), బల్క్ డ్రగ్ మెనిఫెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BDMAI) మధ్య ఇందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు.
ఫార్మా రంగంలో సవాళ్లను అధిగమించేందుకు..
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్యాల అభివృద్ధి చేయడానికి ఈ కొత్త కార్యక్రమం దోహదపడుతుంది. ఫార్మా పరిశ్రమల సహకారంతో ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తారు. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవం కల్పిస్తారు. ఫార్మాస్యూటికల్ రంగంలో ఎదురవుతు...