RRB ALP Job Vacancy | రైల్వేలో కొత్త కొలువులు.. విద్యార్హత టెన్త్ మాత్రమే…
RRB ALP Job Vacancy : రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే (Indian Railway) ఒకటి. రోజుకు కోటిన్నర మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి విస్తృతమైన సేవలను అందించేందుకు నాణ్యమైన మానవ వనరుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం రైల్వే శాఖ (Railway)లో మెకానికల్, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్ (Asistant loco pilot post (ALP) పోస్టుల నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఉద్యోగ స్వభావం
RRB ALP Job Vacancy : ఈ పోస్టులు రైలు నడిపే లోకో పైలట్ (loco pilots)లకు సహాయం చేసే ఉద్యోగాలు. రైలును నడిపే, నిర్వహించే బాధ్యతలు, ప్రమాదాల నివారణ, సాంకేతిక సమాచారం అందించడం వంటి అనేక కీలక కార్యకలాపాల్లో ALP...