PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే..
PM Internship Scheme 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. యువతీయువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన PM ఇంటర్న్‌షిప్ పథకం కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. కొత్త టైంటేబుల్ ప్రకారం, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31 లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. గతంలో, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 12గా నిర్ణయించగా తాజాగా పొడిగించారు. కాగా PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ తోపాటు ఒకసారి రూ. 6,000 ఆర్థికసాయం అందిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు?
PMIS 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు హైస్కూల్ లేదా తదుపరి ఇంటర్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. యువత BA, BSc, B.Com, BCA, BBA, లేదా బిఫార్మా వంటి రంగాలలో డిగ్రీ లేద...