Rajiv Yuva Vikasam | యువత కోసం కొత్త పథకం.. అర్హతలు ఏమిటి ?.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే..
Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. వీరి కోసం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి (self-employment) అవకాశాలు పొందొచ్చు. ఇందుకు ప్రభుత్వం రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. అర్హత పొందిన ప్రతి అభ్యర్థికీ రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందనుంది.
సొంత పరిశ్రమను స్థాపించుకొనేలా..
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం ముఖ్యోద్దేశం. లబ్ధిదారులు స్వయం ఉపాధి ద్వారా తమ జీవితాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ పథకాన్ని లబ్ధిదారులు తమ సొంత వ్యాపారం లేదా చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడా...




