Post-metric Scholarships | స్కాలర్‌షిప్‌ల్లో కొత్త విధానం.. పకడ్బందీగా దరఖాస్తు ప్రక్రియ
Post-metric Scholarships : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ (Post-metric Scholarships) కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం దీన్ని అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) విద్యార్థులకు ఇది వర్తించనుంది. దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ను కోల్పోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది.
రెండు దఫాలుగా అథెంటికేషన్
తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కొత్త దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియలో ప్రధానంగా రెండు ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదట విద్యార్థులు ePass వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌కార్డు, SSC సర్టిఫికేట్...