SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు
SBI PO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ల (POs) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. SBI PO 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు (2024 డిసెంబర్ 27) ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
SBI PO నియామక ప్రక్రియలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు 600 ఖాళీలను అందుబాటులో ఉంచారు. భారత బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సాధించాలని ఆశించే వారికి ఇది సదవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్‌తోపాటు దరఖాస్తు సమర్పణ ప్రక్రియను 2025 జనవరి 16 లోపు పూర్తి చేయాలి. అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు వివరాలు ఇలా ఉన్నాయి.
SBI PO 2025 పోస్టుల వివరాలు
ఖాళీలు: 600
అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.డిగ్రీ చివర...