ESIC Notifications 2025 | మెడికల్ ఆఫీసర్ల నియామకాలు.. జీతం రూ. 1.77 లక్షలు
ESIC Notifications 2025 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్ 2) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 608 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 608 (జనరల్ 254, ఎస్సీ 63, ఎస్టీ 53, ఓబీసీ 178, ఈజీఎస్ 60, పీడబ్లూబీడీ 90) విద్యార్హతలు
అభ్యర్థులు భారత వైద్య మండలి చట్టం 1956 ప్రకారం గుర్తింపు పొందిన MBBS డిగ్రీ కలిగి ఉండాలి.
తప్పనిసరిగా ఒక రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనివారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే.. నియామకం పొందేముందు దీనిని పూర్తి చేయాలి. వయో పరిమితి
CMSE 2022 డిస్క్లోజర్ లిస్ట్‌లోని అభ్యర్థులు: 2022 ఏప్రిల్ 26 నాటికి 35 సంవత్సరాలు మ...



