Avatar 3 | అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ – ట్రైలర్ డేట్ కూడా వచ్చేసింది!
Avatar 3 release date | జేమ్స్ కెమెరూన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది.. ఆయన తీసిన మూవీలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొడతాయి. రాంబో, టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో దేశవిదేశాల్లోని చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశాడు.
అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు పట్టింది. ఇంతకుముందు వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారత్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు అవతార్ సిరీస్ నుంచి రెండు చిత్రాలు రాగా, ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది.
గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3 (Avatar 3) ని కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నహాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం మార్వెల్ ‘ఫెంటాస్టిక్ ఫ...