Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..
Vijay Sethupathi New Movie | కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh)నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడో అని జోరుగా చర్చ నడుస్తుంది. ఒకసారి హీరో గోపీచంద్ తో మూవీ తీయబోతున్నాడని, మరోసారి ఇంకో హీరోకు కథ వినిపించాడని ఇక పట్టాలెక్కడమే తరువాయని ఇలా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఉగాది పండుగ రోజున తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడో చెప్పేశారు.
పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమాని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (makkal selvan Vijay Sethupathi) తీయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా తనే కూడా నిర్మించనున్నారు. అలాగే చార్మి.. పూరి జగన్నాథ్ తో గత కొన్ని సినిమాలుగా సహ నిర్మాతగా ఉంటుంది. డబుల్ఇస్మార్ట్ భారీ ఫ్లాప్ తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే మూవీకి చార్మిని (Charmi) దూరం పెట్టారని కొన్ని రోజులుగా రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి. కానీ ఈ రో...




