Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?
Manchu Manoj : ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో స్వర్గం నరకం చిత్రంతో నటుడుగా మారారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. చాలా సినిమాల్లో విలన్ గా చేసినా ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకుని హీరోగా మారారు. కొన్ని సినిమాలు చేశాక తనే నిర్మాతగా మారి దాదాపు 75 సినిమాలను నిర్మించారు. తిరుపతిలో ఒక స్కూల్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు.
ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు (Mohan Babu) అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో గొడవలు తారా స్థాయికి చేరాయి. అన్ని గొడవలు సద్దుమనిగాయి అనుకున్న తరుణంలోనే మళ్లీ కొత్త వ్యవహారంతో మలుపులు తీసుకుంటుంది.
మంచు మనోజ్ యూనివర్సిటీకి వచ్చి హల్చల్ చేయడం, దానిపై మోహన్ బాబు రియాక్ట్ అయి అతనిపై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి పోలీ...