Saif Ali Khan : కత్తిపోట్లకు గురైన బాలివుడ్ హీరో.. అసలేం జరిగింది?
Saif Ali Khan stabbed : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ముంబై (Mumbai) బాంద్రాలోని ఆయన నివాసం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ ఆగంతకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ఆగంతకుడు చొరబడ్డాడని గుర్తించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఎలాంటి ఆయుధం లేకుండానే అతడికి ఎదురొడ్డారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.
సైఫ్ అలీ ఖాన్ శరీరంపై లోతైన గాయాలు
కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్‌ను లీలావతి ఆస్పత్రి (Lilavati Hospital in Mumbai)కి తరలించారు. ఆయన శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉన్నాయని ఆస్పత్రి సీఈవో డాక్టర్ నీరజ్ ఉట్టమాని తెలిపారు. సైఫ్ అలీకి అయిన గాయా...