Game Changer Review : గేమ్ చెంజర్… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?
Game Changer Review : దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, కియారా అడ్వానీ, జయరాం, శ్రీకాంత్, ఎస్,జే సూర్య ప్రధాన పాత్రలుగా ఈ మూవీ రూపొందింది. మరి ఈ సినిమాలో శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందో ఇ్పుడు చూద్దాం…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే నడిచింది. పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. మూవీ నడిచిన విధానం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్‌కు సరిగా రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే రా మచ్చ, డోప్ సాంగ్స్ ని శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ స్టోరీకి తగ్గట్టుగా, సిట్చువేషన్ కి తగ్గట్టుగా రాలేదు. శంకర్ టేకింగ్ ఫస్ట్ ఆఫ్ లో తేలిపోయిందని చెప్పొచ్చు.
రామ్ చరణ్ , కియరా...