Pushpa 2 box office : అల్లు అర్జున్ సినిమా రికార్డుల జాతర.. 3 రోజుల్లో 600 కోట్ల మార్క్
Pushpa 2 box office | అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు బద్దలు కొడుతోంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. గత సినిమాల వసూళ్ల రికార్డులను మూడు రోజుల్లోనే అధిగమించింది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా రూ. 600 కోట్లకు చేరుకున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో రూ.383 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం భారతదేశంలో దాదాపు రూ. 115.58 కోట్ల నికర వసూళ్లు సాధించింది. శుక్రవారం వసూళ్లను అధిగమించి మొత్తం రూ. 383.7 కోట్లకు చేరుకుంది.
హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.73.5 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.31.5 కోట్లు, తమిళ వెర్షన్ రూ.7.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం నాడు పుష్ప 2 రూ.93.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
పుష్ప: ది రూల్...