Director Sukumar : సుకుమార్ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందో..!
Tollywood News : మొదట్లో లెక్కల మాస్టర్ గా పనిచేసిన డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) సినిమా మీద ప్రేమతో దానికి పులిస్టాప్ పెట్టారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి మొదటి సినిమా ఆర్య తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. గంగోత్రి మూవీ తో ఓ మాదిరి హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తో ఆర్య మూవీ తీసి స్టైలిష్ స్టార్ గా ప్రేక్షకులకు దగ్గర చేసాడు. అల్లు అర్జున్ అంతకుముందు తీసిన మూవీలో కంటే లుక్ పరంగా ఆర్య మూవీలో బెటర్ గా కనిపిస్తాడు. మొదటి సినిమాతోనే సుకుమార్ టేకింగ్ వైజ్ మార్కులు కొట్టేశాడు.
తర్వాత రామ్ తో తీసిన జగడం మూవీ తన ముందు సినిమా ఆర్య సినిమా కంటే భిన్నమైన స్టోరీ ని ఎంచుకుని మాస్ ఎలివేషన్స్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో సరైన హిట్టు దక్కలేదు గానీ స్టోరీని అద్భుతంగా టేకింగ్ చేశాడు. ఈ మూవీ చూసే దర్శక ధీరుడు రాజమౌళి ఇండస్ట్రీలో తనకు పోటీ ఎవరైనా ఉంటే అది సుకుమారే అని అన...




