Mohan Babu | దుష్ప్రచారం చేయకండి.. మీడియాకు మోహన్‌బాబు విజ్ఞప్తి
Mohan Babu : ఓ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తనపై దర్యాప్తు జరుగుతోందని వస్తున్న వార్తలను ఖండించిన మోహన్‌బాబు తాజాగా మరోసారి తన X ఖాతాలో మరో ట్వీట్ చేశారు. హై కోర్టు తన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. తనపై లేనిపోని దుష్ప్రచార జరుగుతోందని, దయజేసి మీడియా దీన్ని మానుకోవాలని కోరారు.
తీవ్రంగా స్పందించిన మోహన్ బాబు
తన ఇంటి వద్ద జరిగిన వివాదాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టుపై మోహన్‌బాబు (Manchu Mohan babu) దాడి చేశారని ఆయపై పోలీసు కేసు నమోదైంది. తన కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్యతో మోహన్‌బాబుకు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద గొడవ జరగ్గా దాన్ని కవర్ చేయడాని మీడియా అక్కడికి వెళ్లింది. మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే మోహన్‌బాబు కోపోద్రిక్త...


