Maoist | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ: కీలక మావోయిస్టు సరెండర్
                    Hyderabad |  మావోయిస్టు పార్టీ (Maoist party ) కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్ర నాయకులు వరుసగా లొంగిపోవడం పార్టీకి మింగుడుపడడం లేదు. తాజాగా ఆ పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం ఆయన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో అధికారులకు లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
బండి ప్రకాశ్ ప్రస్థానం
గత 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన బండి ప్రకాశ్, తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించారు. మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు. 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలతో ఆకర్షితుడై, సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988లో బెల్లంపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో ప్రకాశ్ అరెస్టయ్యారు.ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవ...                
                
             
								



