ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి..
Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) పట్టుబడ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవడానికి గాను పంచాయతీ కార్యదర్శి వద్ద అనుమతి కోరాడు. దీంతో కార్యదర్శి శివకృష్ణ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా స...




