ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..
రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు
లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను ...




