Plane Crash | విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్..?
Air India Ahmedabad Plane Crash Live Updates : ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది, విమానంలో 241 మంది మరణించారు. శుక్రవారం ఉదయం విమానయాన సంస్థ ప్రాణనష్టాన్ని నిర్ధారించింది.
Plane Crash : ప్రమాద తీవ్రత: 1000 డిగ్రీల సెల్సియస్ మంటలు
ప్రమాదానికి (Air India Plane Crash) కారణమేంటంటే దానిపై స్పష్టత ఇప్పటివరకు రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటన స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహా...




