Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిషనల్ ఎస్పీ మృతి..
Chhattisgarh Maoist Attack | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీ (IED Blast)తో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్ రావు గిరిపుంజే (Akash Rao Giripunje) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారని ఐజి బస్తర్ పి. సుందర్‌రాజ్ ధృవీకరించారు. “ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కొంటా ఆసుపత్రికి తరలిస్తుంగా ఆయన మృతిచెందారు. గాయపడిన ఇతర సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని ఐజి తెలిపారు.
IED పేలుడులో కొంటా SDPO, స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ కూడా గాయపడ్డారు, వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ పోలీసుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ASP గిర్పుంజే బలిదానం ఆ దళానికి తీవ్ర నష...




