Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్తత
హైదరాబాద్ (Hyderabad)లోని టప్పాచబుత్ర (Tappachabutra) ప్రాంతంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మందిరం (Hanuman temple) లో మాంసపు ముక్కలు (Meat) కనిపించడం కలకలం రేపింది. ప్రధాన అర్చకుడు (Temple priest) ముందుగా ఈ విషయాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయడంతో ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకున్నారు.
షాకైన ప్రధాన అర్చకుడు
రోజూ లాగే ప్రధాన అర్చకుడు ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చారు. ఆలయం (Hanuman temple)లో శుభ్రపరిచే సమయంలో మాంసపు ముక్కలు కనిపించాయి. దీంతో ఆయన తీవ్రంగా షాకయ్యారు. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించమని కోరారు. ఈ వార్త ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఇతర భక్తులకు చేరింది. కొద్ది నిమిషాల్లోనే స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి...