Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ
Kamareddy : కామారెడ్డిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం (Bribe) డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420 కింద నమోదు చేయబడిన చీటింగ్ కేసుకు సంబంధించిన క్రైమ్ నంబర్ 375/2018 ప్రకారం ఫిర్యాదుదారునిపై కేసు విచారణ త్వరగా పూర్తి చేయడానికి, కేసులో నిర్దోషిగా విడుదల చేయడానికి అనుకూలంగా వ్యవహరించినందుకు సంజయ్ ద్వారా లంచం తీసుకున్నారు. మొదట్లో నాయక్ రూ.15,000 లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.10,000కి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. సంజయ్ వద్ద నుంచి ACB అధికారులు రూ.10,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్...




