Prayagraj Kumbh Mela : కుంభమేళాలో సిలిండర్ పేలి మంటలు..
Fire Accident in Prayagraj Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఉత్సవానికి హాజరైన లక్షలాది మంది జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అధికారులు హుటాహుటిన స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ సమ్మేళనమైన మహా కుంభమేళాలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడం ప్రారంభించడంతో, అనేక వాన్టేజ్ పాయింట్ల నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోందని, వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
అలారం అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు, పరిస్థితిని చూసి స్థానిక అధికారులు సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెద్ద పెద్ద దట్టమైన పొగ మేఘాలు ...