మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్టు – Kunjam Hidma Arrested
Kunjam Hidma Arrested | ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా (Kunjam Hidma) వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్‌పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియ...




