Ganja | హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం
Ganja chocolates seized : గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. నేరుగా సరఫరా చేస్తే పట్టుబడుతామనే భయంతో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. చాకెట్ల మాదిరి ప్యాకింగ్‌తో సప్లయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈ తరహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ షాపులో నిన్న రాత్రి దాడులు చేసిన సైబరాబాద్ స్పెషన్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు జగద్గిగిరిగుట్టలోని ఓ షాపులో వీటిని పట్టుకున్నారు.
2,400 చాక్లెట్లు స్వాధీనం
సైబరాబాద్ స్పెషన్ ఆపరేషన్ టీమ్ పోలీసులు 2,400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 13 కిలోలల బరువు కలిగి ఉన్నాయి. అనంతరం బీహార్‌కు చెందిన సునీల్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడు బీహార్ నుంచి ఈ చాక్లెట్లను తెచ్చి హైదరాబాద్‌లోని స్థానిక కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంకెవరెవరు ఉన్నారు.. ఎవరి అండదండలతో వీరు ఈ దందా చేస్తున్నా...