Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..
విజయవాడ దాటొద్దని సంజయ్ కు ఆదేశాలు
టెండర్లు పిలవకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు(ల్యాప్ టాప్, ఐపాడ్) కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ?
అగ్నిమాపక శాఖ "డీజీ"గా విధులు నిర్వహించినప్పుడు నిధుల దుర్వినియోగం చేసినట్లు ప్రచారం
Andhra Pradesh | సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి అగ్నిమాపక శాఖ "డీజి"గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం తో పాటు నిధులను కూడా తన ఇష్టానుసారంగా ఎలాంటి టెండర్లు లేకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విచారణ పూర్తి అయ్యేంతవరకు విజయవాడ వదలి వెళ్లకూడదని ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
టెండర్లు లేకుండా ల్యాప్...