Sarkar Live

Crime

Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు
Crime

Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi)లో గురువారం ఉద‌యం ఒక్కసారిగా భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రశాంత్‌ విహార్‌ (Prashant Vihar) ప్రాంతంలోని పీవీఆర్‌ (PVR) మల్టీప్లెక్స్‌ సమీపంలో గల ఓ స్వీట్‌ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి స‌మీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఉదయం 11:48 గంటల ప్రాంతంలో స్వీట్‌ షాప్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వెంట‌నే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్ట‌గా తెల్లటి పొడి వంటి పదార్థం ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. Also Read |  Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక ఘటనా స్థలంలో పేలుడుకు సంబంధించి వచ్చిన కాల్‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. పే...
Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌
Crime

Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌

Food Poisoning | హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘ‌ట‌న‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వెంట‌నే ఆయా పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్‌ల కు పంపించాల‌ని ఆదేశించింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన హైకోర్టు.. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతే మాత్రం స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల‌కు కూడా పిల్లలు ఉన్నారని.. మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అధికారులకు త‌లంటింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోర్టు ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని వొచ్చే సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశ...
Tirumala Temple |  తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్
Crime

Tirumala Temple | తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్

Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమ‌ల దేవాలయం (Tirumala Temple )లో ఓ భక్తుడు హుండీలో డబ్బును దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న చోటుచేసుకోగా ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన వేణు లింగం అనే నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతని నుంచి రూ.15,000 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని, సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో హుండీ చుట్టూ టీటీడీ భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేశారు. కాగా, ప్...
ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
Crime

ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లి జిల్లా :  తెలంగాణ‌ రాష్ట్రంలో లోని ఇటీవ‌ల కాలంలో ఏసీబీ (ACB) దాడుల్లో అవ‌నీతికి పాల్ప‌డే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ (Irrigation ) అసిస్టెంట్ ఇంజ‌నీర్ న‌ర్సింగ‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్య‌క్తి నుంచి లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్ట‌ర్‌కు ఓ బిల్లు విష‌యంలో ఏఈ న‌ర్సింగ‌రావుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్ట‌ర్ రూ.20,000లు అంద‌జేశారు. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడి చేసి ప‌ట్టుకున్నారు. అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయ‌న్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలిస...
error: Content is protected !!