Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు… మహారాష్ట్రలో విషాదం
మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘటన కలకలం రేపింది. ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల్లో యంత్రాంగం
ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన...




