Road accident | జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. లారీని ప్రైవేటు బస్సు (Private bus) ఢీకొనడంతో డ్రైవర్ సహా ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 6 గంటల సమయంలో కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం (Road accident)చోటుచేసుకుంది.
Road accident : ఎలా జరిగిందంటే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యోదయానికి ముందు చీకటి ఇంకా అలుముకొని ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కొంత వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవరు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ (lorry) వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు ...




