Helicopter Crashes | కూలిన హెలీకాప్టర్.. ఐదుగురు మృతి
కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఈ ప్రమాదం (Helicopter Crashes) లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి బయలుదేరింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో హెలికాప్టర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.
కాగా ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత జాప్యమవుతోందని అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ ...