Valentines Day | ప్రేమికుల రోజు.. విచిత్ర కానుకలు.. ఏ దేశంలో ఎలాంటివంటే..
                    Valentines Day : ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు.. హృదయాన్ని హత్తుకునే గొప్ప అనుభూతి. ప్రేమంటే.. ఒకరిని మరొకరు సమర్థించుకోవడం, ఆదరించడం, అర్థం చేసుకోవడం, సమయం కేటాయించడం. కేవలం మాటల్లోనే చెప్పలేనిది, హృదయంతో మాత్రమే అర్థం చేసుకోగలిగేదే ప్రేమ. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేకుండా రెండు మనసులను కలిపే శక్తిని కలిగి ఉంటుంది.
ప్రేమకూ ఓ ప్రత్యేక రోజు
మానవ సంబంధాల్లో ప్రేమకు ప్రథమ స్థానముంది. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సొంత వ్యక్తుల మధ్య ప్రేమ ఇలా అనేక రకాలు. ఇందులో ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రపంచం ప్రేమ వల్లే ముందుకు సాగుతోంది. అయితే.. ప్రేమంటే రెండు మనసుల మధ్య కలిగే ఒక మధురానుభూతి మాత్రమేననే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ బలంగా నాటుకుపోయింది. మనకు నచ్చిన వ్యక్తికి దగ్గర కావడమే ప్రేమ అనుకుంటారు ...                
                
             
								


