Jagdeep Dhankhar : ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice President Jagdeep Dhankhar) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో అసౌకర్యం, నొప్పి (uneasiness and chest pain) కారణంగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు. 73 ఏళ్ల ధంఖర్ ప్రస్తుతం ధంఖర్ కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు.
Vice President Jagdeep Dhankhar : నిలకడగానే ఆరోగ్యం
కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్ (Critical Care Unit -CCU)లో ధంఖర్ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ధంఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, నిరంతరం వైద్య పరిశీలన (stable and under observation)లో ఉన్నారని సమా...




