Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక
Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెరపడింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విషయం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో నవంబర్ 20 న జ...




