Sarkar Live

National

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..
National

FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..

FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్ర‌వేశ‌పెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగ‌దారులు రెట్టింపు చార్జ‌లు చెల్లించాలని నిబంధ‌న‌ను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్ర‌వ‌రి 17) నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. FASTag New Rules 2025 : పాటించ‌కుంటే డ‌బుల్‌ వ‌డ్డింపు సాధార‌ణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జ‌ర‌గ‌వు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో త‌మ ఫ...
Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
National

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?

Strong earthquake In Delhi | దేశ‌ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్ర‌త నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డ‌య్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది. Strong earthquake : ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఈ భూకంపం తీవ్ర‌త ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...
Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం

Waqf Amendment Bill : వ‌క్ఫ్‌ సవరణ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను స‌మ‌ర్పించ‌గా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము క‌మిటీ ఎదుట వ్య‌క్త‌ప‌రిచిన అభ్యంత‌రాల‌ను జేపీసీ నివేదిక నుంచి తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ మండిప‌డింది. దీన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొల‌గించ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం ప్ర‌తిప‌క్ష నేత‌ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంత‌రాల‌ను వ్య‌క్...
Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు
National

Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు

New Delhi : ఎన్నికలకు ముందు " ఉచిత బహుమతులు (Freebies ) " ప్రకటించే పార్టీలపై భారత సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది . ఇటువంటి పథకాలు తరచుగా ప్రజలను పని చేయకుండా చేస్తాయ‌ని, దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కాకుండా అడ్డుకుంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు ఖండిస్తూ, ఉచిత రేషన్, డబ్బు లభిస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. నైట్ షెల్టర్లకు సంబంధించిన కేసును విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవై, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు అంద‌రిన్నీ ఆలోచింప‌జేస్తున్నాయి."దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే న‌గ‌దు పొందుతున్నారు" అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. Freebies తో ప‌రాన్న జీవుల‌ను సృష్టిస్తున్నా...
error: Content is protected !!