Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వజం
Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ బీజేపీ మంగళవారం ఒక వీడియో విడుదల చేసింది. ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసినా ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. తాను ఆమ్ ఆద్మీ (సామాన్య మానవుడు) అంటూనే కేజ్రీవాల్ అద్దాల మెడను కట్టుకున్నారని విమర్శించింది. ప్రభుత్వం తరఫున ఇల్లు తీసుకోనని చెబుతూనే 7-స్టార్ రిసార్ట్‌ను నివాసంగా మార్చుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నివాసంలో ప్రభుత్వ ఖజాను వెచ్ఛించి రూ.1.9 కోట్లతో మార్బుల్ గ్రానైట్, లైటింగ్, రూ.1.5 కోట్లతో మరమ్మతులు, రూ. 35 లక్షలతో జిమ్, స్పాను కేజ్రీవాల్ ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. ఒక సామాన్య మనిషిని అని చెప్పుకొనే కేజ్రీవాల్ ప్రజల సొమ్ముతో విలాసవంత జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. ఈ భవనానికి సంధించిన వీడియోల...




