Justice Suryakant | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. 24న సరికొత్త తరహాలో ప్రమాణ స్వీకారం..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత CJI, BR గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. అయితే, మొదటిసారిగా, ఆరు దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్‌లో జరిగే భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కొత్త CJIగా జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి డజనుకు పైగా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు హాజరవుతారని బార్ & బెంచ్ నివేదించింది . భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంత పెద్ద అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరు కావడం ఇదే మొదటిసారి...




