Hanmakonda : ఆర్డీవో సాబ్ జర దేఖో..?
తహశీల్దార్ లీలలపై ఆర్డీవో నజర్ వేస్తే విస్తుపోవాల్సిందేనట..?
Hanmakonda | లంచావతారులు సైతం విస్తుపోయేలా హసన్ పర్తి (Hasanparthi) తహశీల్దార్ చేసిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో జిల్లావ్యాప్తంగా అధికారులతో పాటు సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. ఇప్పుడు హసన్ పర్తి తహసీల్దార్ (tahsildar) లీలలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లపై హన్మకొండ ఆర్డీవో ఒకవేళ దృష్టి సారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని, తహశీల్దార్ బాగోతాలు బయటపడే అవకాశం ఉందని మండలంలో ప్రచారం జరుగుతోంది.
తహశీల్దార్ తన ఇష్టానుసారంగా నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసి మండలం వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు చేస్తున్న రియల్టర్ లకు పూర్తిస్థాయిలో సహకరించాడని,తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి చేసిన నాలా కన్వర్షన్ లు కనుక ఆర్డీవో ...




