Indiramma Illu | ఇందిరమ్మ గృహంపై గుబులు..
పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటూ గ్రామాల్లో జోరుగా ప్రచారం
సామాన్యుల్లో గుబులు రేపుతున్న కాంగ్రెస్ లీడర్ ల మాటలు
పారదర్శకత మాటలకే పరిమితమా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా?
లబ్ధిదారుల ఎంపికలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఉంటుందా?
Indiramma Illu | తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ గృహ పథకం కీలక భూమిని పోషించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing scheme) ప్రారంభించి హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏడాదికి 4.5 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దానిలోభాగంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ల ఇండ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు విడతల వారిగా ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ (Indiramma Ap...




