Sarkar Live

Special Stories

Special Stories

Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!
Special Stories

Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!

Bala Kishore Reddy Political Journey | రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు.. ప్రజలతో మమేకమయ్యే మనసుండాలని నిరూపిస్తున్నారు యువనేత బాల కిషోర్ రెడ్డి (Bala Kishore Reddy) . సామాజిక సేవను కేవలం బాధ్యతగా కాకుండా, ఒక రాజకీయ శక్తిగా మలుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సేవే పునాదిగా.. ప్రజలే అజెండాగా! సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంటారు. కానీ, బాల కిషోర్ రెడ్డి శైలి ఇందుకు భిన్నం. సామాజిక సేవను తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మహిళల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాల కిషోర్ రెడ్డిని ఒక నాయకుడిగా ప్రజల్లో నిలబెడుతోంది. కొమ్మాల జాతరలో ప్రభా బండ...
నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam
Special Stories

నాలా కన్వర్షన్‌ల ముసుగులో మున్సిపల్ ఖజానాకు గండి.. ‌‌ –NALA Conversion Scam

"బదిలీతో తహశీల్దార్ తప్పించుకున్నట్లేనా?” బరితెగించిన నిర్ణయాలు.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బదిలీపై వెళ్లిన తహశీల్దార్ లేఅవుట్ అనుమతులు లేకుండానే హుజురాబాద్ లో వందలాది ప్లాట్లకు కన్వర్షన్ Huzurabad NALA Conversion Scam | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లకు అధికార ముద్ర పడిందా? వందలాది ప్లాట్లకు లేఅవుట్ అనుమతులు లేకుండానే నాన్-అగ్రికల్చర్ (ఎన్‌ఏ) కన్వర్షన్‌లు ఎలా జరిగాయి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ అనుమతులు లేకుండానే కన్వర్షన్‌లు? స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ అనుమతులు పొందకుండా అభివృద్ధి చేసిన పలు అక్రమ లేఅవుట్లలో వందలాది ప్లాట్లు విక్రయించబడ్డాయి. వ్యవసాయ భూముల్లోని అవే ప్లాట్లకు గజాల వారిగా కన...
KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌
Special Stories

KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వరుస ప‌రాజ‌యాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుక‌బ‌డిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్‌, మునిసిప‌ల్ ఎన్నికల్లో ఓటములను చ‌వి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ (Jubilee Hills by-election result)లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. వరుస పరాజయాలకు కార‌ణాలు ఇవేనా? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్ర‌జాద‌ర‌ణ పొందింది. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. ...
ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam
Special Stories

ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam

పౌర సరఫరాల శాఖ కు 30 కి పైగా ఏసికెలు పెండింగ్ ధాన్యం కేటాయింపులు లేకుండానే ధాన్యం దిగుమతి Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు? హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర...
రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply
Special Stories

రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply

మంజునాధ ఏంది నీ దందా .. Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ ఎత్తున వ్యత్యాసం ఉండటం పౌరసరఫరాల శాఖలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో మిల్లర్ 2 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, ఆ విషయం ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2 కోట్ల ధాన్యం ఎటుపోయింది ? అక్షరాల రెండు కోట్లు విలువ చేసే ధాన్యం ఎక్కడ పోయినట్లు..?బహిరంగ మార్కెట్ కు తరలించారా ?కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందా?అనే విషయాలు పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో ఆ మిల్లులో ధాన్యం లేని విషయాన్ని సంబంధిత "డిటి" ఎందుకు గుర్తించలేదు? అనేది ప్రశ్న.వివరాల్లోకెళితే హన్మకొండ జ...
error: Content is protected !!