PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం
PV Sindhu Wedding : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) నూతన వధువుగా మారారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయితో వివాహమాడి మూడు ముళ్లబంధంలో ప్రవేశించారు. రాజస్థాన్ రాష్ట్ర ఉదయ్‌పూర్‌లోని విలాసవంత రిసార్ట్‌లో వీరి పెళ్లి నిన్న రాత్రి (డిసెంబరు 22) జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీవీ సింధు- వెంకట దత్తసాయి వివాహం సంప్రదాయ, ఆధ్యాత్మిక రీతిలో జరిగింది. పెళ్లి రాజస్థాన్‌లో జరిగినా రిసిప్షన్ మాత్రం హైదరాబాద్‌లోనే జరగనుంది. సింధు స్వస్థలమైన భాగ్యనగరిలో రేపు (డిసెంబరు 24) గ్రాండ్‌గా జరగనుంది.
క్రీడాకారిణి జీవితంలో ఐటీ నిపుణుడు
ఒలింపిక్ పతకాలు రెండు సార్లు గెలుచుకున్న భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరైన పీవీ సింధు తన జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించారు. 29 ఏళ్ల స...