Asifabad | ఆసిఫాబాద్‌లో భారీ వర్షాలతో నీటమునిగిన గ్రామం
Kumram Bheem Asifabad : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది, సమీపంలోని వాగు ఉధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో చింతలమానేపల్లి మండలంలోని డిమ్డా గ్రామం గురువారం పూర్తిగా మునిగిపోవడంతో మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా ఇండ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటి నుంచి భయంతో నివసిస్తున్న నివాసితులు, తమను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని, ప్రాథమిక అవసరాలుక ల్పించి భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.
ప్రాణహిత నది (Pranihita River), పెద్దవాగు వాగుల ఒడ్డున ఉన్న అనేక ఇతర లోతట్టు ప్రాంతాలు కూడా తెగిపోయే ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నందున బురదమయమైన ప్రాంతాలలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు చేరుకోవడానికి ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలపై ఆధారపడుతున్నారు.
...