Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి
Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ...



