మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ పై చిగురిస్తున్న ఆశలు.. –Machilipatnam Repalle Railway Line
                    కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం
విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం
తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్
మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్
విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.
మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది
మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా – చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...                
                
             
								



